టాక్సిక్ కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ఎంట్రీ

Hollywood Action Director JJ Perry Arrives in Mumbai For Yash’s Toxic Movie

కన్నడ స్టార్ హీరో యష్‌ ‘కేజీఎఫ్’ సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. అయితే ‘కేజీఎఫ్ – చాప్టర్ 2’ వచ్చి రెండేళ్లు దాటిపోయింది. దీంతో ఆయన తదుపరి మూవీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో యష్ హీరోగా ‘టాక్సిక్‌’ చిత్రం గత కొన్నిరోజుల క్రితం బెంగళూరులో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యష్‌ లక్కీ నంబర్‌ 8 కావడంతో, ఆగస్టు 8న 8-8-8 (2024, ఆగస్టు 8) అనే నంబర్‌ కలిసి వచ్చేలా సినిమాను ప్రారంభించారు. కేజీఎఫ్ సిరీస్ తరవాత యష్‌ నుంచి వస్తోన్న చిత్రం కావడంతో ఈ టాక్సిక్‌ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. మేకర్స్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా దీనికి సంబంధించి సాలిడ్ అప్‌డేట్ వచ్చింది.

కంప్లీట్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పోరాట ఘట్టాలు ఓ రేంజ్‌లో ఉంటాయని తెలుస్తోంది. అందుకే దీనికోసం పనిచేయడానికి హాలీవుడ్ టెక్నిషియన్స్ రంగంలోకి దిగుతున్నారు. ‘జాన్ విక్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, మరియు డే షిఫ్ట్’ తదితర హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన యాక్షన్ డైరెక్టర్ జేజే పెర్రీ టాక్సిక్ మూవీ కోసం పనిచేయనున్నాడు. ఇందుకోసం తాజాగా ఆయన ముంబైకి చేరుకున్న సందర్భంగా విమానాశ్రయంలో విజువల్స్ వైరల్ అవుతున్నాయి.

కాగా ‘ఎ ఫెయిరీ టెల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’ అనేది ఉపశీర్షికగా ఉన్న ఈ సినిమాకు ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. KVN ప్రొడక్షన్స్ మరియు మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మాత వెంకట్‌ కె.నారాయణతో కలిసి యష్‌ స్వయంగా నిర్మిస్తుండటం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.