జనక అయితే గనక.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్

Janaka Aithe Ganaka OTT Release Date Locked

ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో దిల్‌ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సంగీర్త‌న హీరోయిన్‌గా నటించింది. చిత్రం విడుదలకు ముందే రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్‌లు అన్నీ ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో జనక అయితే గనక ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోర్ట్‌ రూమ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకుంది. సెన్సిబుల్ స్టోరీకి సుహాస్ నటన తోడవడంతో ఈ సినిమా ఆడియెన్స్‌ను అలరించింది. దీంతో ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌పై మూవీ లవర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా చిత్ర బృందం దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించింది. జనక అయితే గనక సినిమా త్వరలోనే డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైనట్టు తెలిపింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

అయితే ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న యూజర్లకు ముందస్తు యాక్సెస్‌తో అధికారిక ప్రీమియర్‌కి ఒక రోజు ముందే ఈ సినిమాను చూసే అవకాశం కల్పించింది. సో.. మూవీ లవర్స్ గెట్ రెడీ.. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయినవారు మరియు ఇంకోక్కసారి ఈ సినిమాను వీక్షించాలనుకునేవారు త్వరలోనే ఎంచక్కా ఇంట్లో కూర్చునే దీనిని చూసేయడానికి సిద్ధంగా ఉండండి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.