చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కంగువ’ మరికొన్ని రోజుల్లో విడుదల కానుండగా ఆ సినిమాకు పని చేసిన ఎడిటర్ నిషాద్ యూసఫ్ మృతి చెందారు. దీంతో చిత్ర యూనిట్ ఒక్కసారిగా షాక్‌కి గురైంది. కాగా నిషాద్ వయసు 43 ఏళ్లే కావడం గమనార్హం. నవంబర్ 14న కంగువ ప్రపంచవ్యాప్తంగా మొత్తం 10 భాషల్లో విడుదల కానుంది. ఇక ఆయన మృతిపై చిత్ర బృందం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో.. “మా ప్రియమైన ఎడిటర్ నిషాద్ యూసుఫ్ ఆకస్మికంగా మరణించినందుకు మేము తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నాం. ఈ వార్త మాకు చాలా బాధను కలిగిస్తోంది. మీ ప్రతిభ, అంకితభావం మరియు విజన్ మా బృందానికి అమూల్యమైన సంపద. మీరు లేకపోవడం మాకు తీవ్ర శూన్యాన్ని మిగిల్చింది. ఈ కష్ట సమయంలో మా ఆలోచనలు మరియు ప్రార్థనలు మీ కుటుంబం మరియు స్నేహితులతో ఉంటాయి” అని పేర్కొంది.
నిషాద్ సొంత రాష్ట్రం కేరళ లోని కొచ్చిలో ఈ రోజు ఉదయం తన నివాసంలో విగతజీవిగా కనిపించాడు. అయితే ఆయన మరణానికి గల కారణాలు తెలియాల్సివుంది. ప్రస్తుతం దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా యూసఫ్ టోవినో థామస్ నటించగా మలయాళంలో వచ్చిన బ్లాకబస్టర్ మూవీ ‘తల్లుమాల’ చిత్రానికి గాను నిషాద్ ఉత్తమ ఎడిటర్‌గా స్టేట్ అవారర్డు సైతం అందుకున్నాడు. ప్రస్తుతం మమ్ముట్టి హీరోగా వస్తున్న బజూక సినిమాకు పని చేస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: