కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందించారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. కంగువ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాను నైజాం ఏరియాలో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. నవంబర్ 14న కంగువ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ విశాఖపట్నంలో కంగువ మెగా ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “హీరో సూర్య గారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో కలిసి ఈ ఈవెంట్‌లో పాల్గొనడం గర్వంగా అనిపిస్తోంది. ఆయన పక్కనే కూర్చునే అవకాశం దక్కింది. సూర్య గారి అభిమానిగా ఉండటం కష్టం. ఎందుకంటే ఆయనలా ఫిట్‌నెస్ మెయింటేన్ చేయాలి. ఆయనలా డెడికేటెడ్‌గా ఉండాలి.” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “నేను పుట్టి పెరిగింది చెన్నైలో. తెలుగు ఆడియెన్స్‌కు ప్రాపర్ తమిళ చిత్రాన్ని పరిచయం చేసింది సూర్య గారే. డైరెక్టర్ శివ గారి గురించి తమిళంలోనే కాదు తెలుగులో చాలా పాజిటివ్‌గా చెబుతారు. జ్ఞానవేల్ రాజా గారు నాకు మంచి ఫ్రెండ్. ఆయనకు కంగువ మరింత మంచి పేరు తీసుకురావాలి” అని అన్నారు.
ఇక చిత్ర దర్శకుడు శివ మాట్లాడుతూ.. “నేను జ్ఞానవేల్ రాజా గారికి మూడు కథలు చెప్పాను. ఆయనకు నచ్చాయి. మరో కథ ఉంది సార్ కానీ ఇది బడ్జెట్ ఎక్కువ అవుతుంది అన్నాను. పర్లేదు చెప్పండి అన్నారు. అలా చెప్పిన కథే కంగువ. ఈ కథను సూర్య గారికి చెప్పండి అని జ్ఞానవేల్ గారు అన్నారు. సూర్య గారికి చెప్పగానే హగ్ చేసుకుని ఈ సినిమా మనం చేద్దాం శివ అన్నారు” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “అలా కంగువ మొదలైంది. ప్రతి దర్శకుడికి ఒక ఎపిక్ మూవీ చేయాలని ఉంటుంది. నాకూ అలాంటి అవకాశం కంగువతో దొరికింది. నాకు దేవిశ్రీ ప్రసాద్ లాంటి మంచి టీమ్ మెంబర్స్ దొరికారు. కంగువ ఒక బ్యూటిఫుల్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇస్తుంది. తప్పకుండా నవంబర్ 14న థియేటర్స్ కు వెళ్లమని రిక్వెస్ట్ చేస్తున్నా” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































