ప్రిన్స్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. సాయి పల్లవి ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ చిత్రం దీపావళికి అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చీఫ్ గెస్ట్‌గా హాజరైన ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఆడియన్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. మీ అందరి సపోర్ట్ వల్లే కల్కి ఒక మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. అమరన్ విషయానికొస్తే.. రెండు వారాలు ముందు సాయి పల్లవి ఇంట్రో వీడియో చూశాను. అప్పుడే ఈ సినిమా చూడాలని డిసైడ్ అయ్యాను. ఇది చాలా వండర్ఫుల్ స్టోరీ . డైరెక్టర్ గారు చాలా క్లియర్ విజన్‌తో ఉన్నారు. ఇలాంటి స్టోరీ చేయాలంటే చాలా ప్యాషన్ కావాలి” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఒక రియల్ స్టోరీ తీసినప్పుడు చాలా బాధ్యత ఉంటుంది. అలాంటి కథలు ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాయి. కమల్ హాసన్ గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం వెరీ గ్రేట్. సాయి పల్లవి గారికి మీ అందరిలోనే నేను కూడా ఫ్యాన్‌ని. శివ కార్తికేయన్ డాక్టర్ సినిమాకి నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. చాలా డిఫరెంట్ రోల్స్ చేస్తుంటారు. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు చాలా మంది పీపుల్ కి కనెక్ట్ అవుతాయి” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: