ప్రిన్స్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దీపావళికి అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. ఈమేరకు నేచురల్ స్టార్ నాని చేతులమీదుగా దీనిని విడుదల చేయడం విశేషం. ఇక ఈ ట్రైలర్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అమరవీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని పరిచయం చేస్తుంది.
మేజర్ ముకుంద్, అతని కుమార్తె హార్ట్ టచ్చింగ్ ఫుటేజ్‌తో ట్రైలర్ ప్రారంభమైయింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివకార్తికేయన్, అతని భార్యగా సాయి పల్లవి, ఆన్-స్క్రీన్ డాటర్ క్యారెక్టర్స్ లోకి ట్రైలర్ నేచురల్‌గా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం కట్టిపడేసింది.
తన దేశానికి సేవ చేయడంలో మేజర్ ముకుంద్ నిబద్ధత గూస్ బంప్స్ తెప్పించింది. ట్రైలర్‌లో ధైర్యం, త్యాగం థీమ్స్ తో పాటు మేజర్ ముకుంద్ సైనిక జీవితం, ఫ్యామిలీ బాండింగ్‌ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ‘అమరన్’ మేజర్ ముకుంద్ చేసిన త్యాగాలకు గొప్ప ట్రిబ్యూట్‌గా వుంటుందని ట్రైలర్ ప్రామిస్ చేస్తోంది.
శివకార్తికేయన్ బ్రిలియంట్ పెర్ఫర్మెన్స్ ఇచ్చారు. క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా ఫిట్ అయ్యారు. సాయి పల్లవి తన పాత్రలో అద్భుతంగా నటించింది. సిహెచ్ సాయి అందించిన విజువల్స్ అద్భుతంగా వున్నాయి. జి.వి.ప్రకాష్ కుమార్ బీజీఎం ఎక్స్ ట్రార్డినరీగా వుంది. రాజ్‌కుమార్ పెరియసామి దేశభక్తి, కుటుంబ భావోద్వేగాలను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేశారు.
ఇక ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికొస్తే, టాప్ క్లాస్‌గా వున్నాయి. పవర్ ఫుల్ నెరేటివ్, ఎమోషనల్ డెప్త్‌తో ట్రైలర్ హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేసింది. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























