మచ్ అవైటెడ్ సూర్య కంగువా రిలీజ్ కు రెడీ అవుతుంది. ప్రస్తుతం టీం సినిమాను నార్త్ లో తెగ ప్రమోట్ చేస్తున్నారు.త్వరలోనే సౌత్ లో కూడా ప్రమోషన్స్ స్టార్ట్ కానున్నాయి.ఈసినిమాపై తమిళంలోనే కాదు మిగితా భాషల్లో కూడా మంచి అంచనాలు వున్నాయి.ఇంతకుముందు ఈసినిమా నుండి ట్రైలర్ రిలీజ్ కాగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక సినిమా రిలీజ్ కు ముందు రెండో ట్రైలర్ కూడా రానుందని ప్రమోషన్స్ లో డైరెక్టర్ శివ చెప్పేశాడు.ఫస్ట్ ట్రైలర్ ను మొత్తం పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వున్న కంటెంట్ తో కట్ చేశారు.అయితే సెకండ్ ట్రైలర్ లో ఫ్రాన్సిస్ పరిచయం చేయనున్నారు.ఇందులో సూర్య డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.అందులో ఒకటి కంగువా కాగా మరొకటి ఫ్రాన్సిస్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కంగువాలో దిశా పటాని ,బాబీ డియోల్ ,యోగిబాబు ,రెడిన్ కింగ్స్ లే కీలక పాత్రల్లో నటించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.స్టూడియో గ్రీన్ తో కలిసి యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.నవంబర్ 14న భారీ స్థాయిలో విడుదలకానుంది.ఈసినిమా విజయంపై టీం ఫుల్ కాన్ఫిడెంట్ గా వుంది.ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుంది.
ఇదిలావుంటే సూర్య రీసెంట్ గా తన తన 44 వ సినిమా కూడా పూర్తి చేశాడు.పేట ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఇందులో సూర్య గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు.ఇక త్వరలోనే సూర్య తన 45వ సినిమాను కూడా మొదలుపెట్టనున్నాడు.ప్రముఖ నటుడు ఆర్ జె బాలాజీ ఈసినిమాను డైరెక్ట్ చేయనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























