చేసింది తక్కువ సినిమాలే అయినా… కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కేరళకుట్టి అనుపమ పరమేశ్వరన్. మలయాళ చిత్రం `ప్రేమమ్`తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అనుపమ… మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ సినిమా తీసుకువచ్చిన గుర్తింపుతో తెలుగు, తమిళ భాషల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకుంది. అంతేకాదు.. మలయాళ చిత్ర పరిశ్రమ తరహాలోనే తెలుగులో నటించిన తొలి చిత్రం `అఆ`తోనూ… తమిళంలో నటించిన మొదటి సినిమా `కొడి`తోనూ విజయాలను ఒడిసిపట్టుకుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ… మరో దక్షిణాది భాషలో ఎంట్రీ ఇస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… పునీత్ రాజ్‌కుమార్ హీరోగా `నట సార్వభౌమ` పేరుతో ఓ కన్నడ చిత్రం తెరకెక్కుతోంది. `పోటుగాడు` చిత్రంతో తెలుగులోనూ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సక్సెస్ఫుల్ కన్నడ డైరెక్టర్ పవన్ వాడేయర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో… కన్నడసీమకు హీరోయిన్గా పరిచయమవుతోంది అనుపమ. అంతేకాదు… లాయర్ పాత్రలో నటనకు అవకాశమున్న పాత్రలో కనిపించనుందట. ఫిబ్రవరి 7న ఈ సినిమా తెరపైకి రానుంది. మలయాళ, తెలుగు, తమిళ భాషల్లో మొదటి సినిమాలతో విజయాలను అందుకున్న అనుపమ… కన్నడ పరిశ్రమలోనూ ఈ ఫీట్‌ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.
[youtube_video videoid=K2Ek6i2yB94]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: