రజినీకాంత్ ధర్మన్‌లో నటిస్తున్న రామ్

Ram Joins Rajinikanth’s Dharman in a Key Role

సౌత్ ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ‘ధర్మన్’ లోకి ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. సూపర్‌స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ కమర్షియల్ యాక్షన్ డ్రామాను ఉలగనాయగన్ కమల్ హాసన్ నేతృత్వంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్మరియు ఆర్. మహేంద్రన్ టర్మెరిక్ మీడియాతో కలిసి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ‘ఓ మై కడవులే’, ‘డ్రాగన్’ సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న అశ్విత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రంలో రామ్ రా అండ్ రస్టిక్ మేకోవర్‌తో సరికొత్త పవర్‌ఫుల్ అండ్ మాసివ్ క్యారెక్టర్‌లో అలరించబోతున్నారు. భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయే ఇద్దరు దిగ్గజాలు రజినీకాంత్, కమల్ హాసన్‌ల ప్రాజెక్ట్‌లో భాగమవడం పట్ల రామ్ పోతినేని ఆనందం వ్యక్తం చేస్తూ, ఇది తన కెరీర్‌లోనే మరచిపోలేని గౌరవంగా భావిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.ఈ చిత్రంలో రజినీకాంత్, రామ్ పోతినేనిలతో పాటు నయనతార, సిమ్రాన్, శ్రీలీల, రాశీ ఖన్నా, మరియు యోగి బాబు వంటి భారీ తారాగణం నటిస్తోంది.

రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ, ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటింగ్, మరియు ప్రముఖ స్టంట్ మాస్టర్స్ అన్బరివ్ యాక్షన్ సీక్వెన్స్‌లను డిజైన్ చేస్తున్నారు. వివిధ తరాలకు చెందిన నటీనటుల కలయికతో మరియు అనిరుధ్ BGM తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో ఆడియన్స్‌కు మైండ్ బ్లోయింగ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని అంచనా వేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.