హాఫ్ మిలియన్ దిశగా మత్తువదలరా 2

MathuVadalara 2 excellent start at USA Box Office

చిన్న సినిమాగా నిన్న విడుదలైన మత్తువదలరా 2 సూపర్ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకోవడంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5కోట్లకు పైగా ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.దాంతో బ్రేక్ ఈవెన్ లో 40శాతం టార్గెట్ ను చేరుకుంది.ఈసినిమా అటు నార్త్ అమెరికా లోసాలిడ్ వసూళ్లను రాబడుతుంది.ప్రీమియర్స్ తో కలుపుకొని తొలి రోజు 305k డాలర్ల వసూళ్లను సొంతం చేసుకుంది.ఈరోజుతో బ్రేక్ ఈవెన్ కానుంది.ఫుల్ రన్ లో అక్కడ 1మిలియన్ మార్క్ ను చేరుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తెలుగు రాష్ట్రాల్లో సెకండ్ డే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి.ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పోటీ లేకపోవడం అడ్వాటేంజ్ కానుంది.దేవర వచ్చే వరకు మత్తువదలరా 2కు ఎదురులేనట్లే.దాంతో ఫుల్ రన్ లో ఈసినిమా 15నుండి 20కోట్ల వసూళ్లను రాబట్టే ఛాన్స్ వుంది.ఓవరాల్ గా సీక్వెల్ ట్యాగ్ తో వచ్చిన మత్తువదలరా 2,ఫస్ట్ పార్ట్ ను మించిన విజయాన్ని అందుకోనుంది.

ఇందులో శ్రీ సింహ,కమెడియన్ సత్య,ఫారియా అబ్దులా లీడ్ రోల్స్ లో నటించగా రితేశ్ రానా డైరెక్ట్ చేశాడు.సునీల్,వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో మెరిశారు.కాలభైరవ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్,క్లాప్ ఎంటర్టైన్మెంట్ నిర్మించాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.