ఓవర్సీస్ లో దేవర హావ కొనసాగుతూనే వుంది.ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే నార్త్ అమెరికాలో 1మిలియన్ డాలర్ ప్రీ సేల్స్ తో అదరగొట్టగా నిన్నటితో 1.5మిలియన్ డాలర్ల మార్క్ ను క్రాస్ చేసింది.ఇంత తొందరగా ఇండియన్ మూవీ ఈ ఫీట్ సాధించడం ఇదే మొదటి సారి.దాంతో దేవర ఆల్ టైం రికార్డు సృష్టించింది.ప్రీమియర్స్ కు ముందే 2మిలియన్ క్లబ్ లో చేరనుంది.హిట్ టాక్ వస్తే అక్కడ దేవర ప్రభంజనం కొనసాగించనుంది.అటు ఆస్ట్రేలియా లోకూడా సాలిడ్ గా స్టార్ట్ చేసింది.ఇప్పటివరకు 54k డాలర్ల ప్రీ సేల్స్ జరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీ గా వుంది దేవర టీమ్.ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది.యు/ఏ సర్టిఫికెట్ తో థియేటర్లలోకి రానుంది.రన్ టైం కూడా ఎక్కువగానే ఉందని అంటున్నారు.ఇందులో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.యాక్షన్ ఎపిసోడ్ లు ఆదరిపోనున్నాయని టీం చెపుతుంది.అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేయనుంది.ట్రైలర్ లో విన్న బీజీఎమ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది.
కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ,సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించారు.తెలుగులో వీరిద్దరికి ఇదే మొదటి సినిమా.ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ నిర్మించగా సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























