నటీనటులు: శ్రీ సింహ కోడూరి, సత్య, ఫరియా అబ్దుల్లా, సునీల్, అజయ్, రోహిణి, ఝాన్సీ తదితరులు
సంగీతం: కాల భైరవ
సినిమాటోగ్రఫీ: సురేశ్ సారంగం
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ ఆర్
నిర్మాణం: క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్
నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు
సమర్పణ: మైత్రీ మూవీ మేకర్స్
దర్శకత్వం: రితేష్ రానా
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో, ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎమ్.ఎమ్ కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మత్తు వదలరా 2’. రితేష్ రానా దర్శకత్వం వహించాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘మత్తు వదలరా’కు సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్, టీజర్, ప్రమోషనల్ సాంగ్.. ఇలా ప్రతి ప్రమోషన్ మెటీరియల్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో మత్తు వదలరా 2 నేడు ప్రేక్షకులముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాతో శ్రీ సింహ మళ్ళీ హిట్ అందుకున్నాడా? సత్య కామెడీ వర్కవుట్ అయిందా? శ్రీ సింహ, రితేష్ రానా కాంబో సక్సెస్ అందుకున్నారా? లేదా? అన్నది ఇప్పుడు చూద్దాం..
కథ:
కథానాయకుడైన బాబూ మోహన్ (శ్రీ సింహ కోడూరి), అతని స్నేహితుడు యేసు దాసు (హాస్యనటుడు సత్య) హీ (HE – హై ఎమర్జెన్సీ) బృందంలో పని చేస్తుంటారు. కిడ్నాప్ కేసులను డీల్ చేయడం వీరి డ్యూటీ. అయితే ఆ సంస్థ ఇచ్చే జీతం సరిపోక అడ్డదారులు తొక్కుతుంటారు. కేసులను సాల్వ్ చేసే క్రమంలో కిడ్నాపర్స్‌ని పట్టుకొని వాళ్ళు డిమాండ్ చేసిన డబ్బులోనుంచి కొంత మొత్తం వీరు కొట్టేస్తుంటారు.
ఒకవైపు అధికారులు మరోవైపు బాధితులు కూడా పిల్లల ప్రాణాలు కంటే డబ్బు ముఖ్యం కాదని భావించడంతో వారి ఆటలు సాగుతుంటాయి. కానీ ఇలాంటి ఎన్ని కేసులు పరిష్కరిస్తున్నా వారి ఆర్ధిక అవసరాలకు సరిపోవు. ఈ నేపథ్యంలో ఒక పెద్ద కిడ్నాప్ కేసు సాల్వ్ చేసే బాధ్యత వీరిపై పడుతుంది. ఇక్కడే తమ తెలివిని ఉపయోగిస్తారు బాబు, యేసు.
కిడ్నాపర్ రెండు కోట్లు డిమాండ్ చేసిన విషయం తెలుసుకుని హీ టీంతో సంబంధం లేకుండా ఈ కేసుని డీల్ చేసి ఆ డబ్బుతో సెటిల్ అయిపోవాలని పథకం వేస్తారు. కానీ వాళ్ళ ప్లాన్ బెడిసికొట్టడమే కాకుండా, తిరిగి వీళ్ళే ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. అయితే దీనినుంచి బాబు, యేసు ఎలా బయటపడ్డారు? తమ నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నారు? వీరికి కథానాయిక నిధి (ఫరియా అబ్దుల్లా) ఎలా సహకరించింది? అన్నదే కథ.
విశ్లేషణ:
‘మత్తు వదలరా’ సినిమాకు పర్‌ఫెక్ట్ సీక్వెల్‌గా ‘మత్తు వదలరా 2’ను రూపొందించాడు దర్శకుడు రితేష్ రానా. ఫస్ట్ పార్ట్ టెంపోకి ఏమాత్రం తగ్గకుండా ఇందులో స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ముఖ్యంగా కామెడీ సీన్స్‌పై దృష్టి సారించిన ఆయన అందుకు తగ్గ పంచ్ డైలాగ్స్ కూడా పెట్టాడు. తొలి పార్టులో మెగాస్టార్ చిరంజీవి పేరును బాగా వాడిన రితేష్, ఈ సినిమాలోనూ అనేక సందర్భాల్లో సమయోచితంగా చిరంజీవి క్రేజ్‌ను ఉపయోగించుకున్నాడు.
డెలివరీ ఏజెంట్స్‌గా పనిచేసే బాబు, యేసు హీ టీంలోకి ఎలా వచ్చారో చూపిస్తూ కథ ఆరంభమవుతుంది. పార్ట్1ని రీక్యాప్ చేస్తూ ప్రారంభ సన్నివేశాలు కొనసాగుతాయి. బాబు, యేసు పాత్రలని పరిచయం చేసే కిడ్నాప్ సీక్వెన్స్ థియేటర్లో నవ్వులు పంచేలా వుంటుంది. అలానే కర్మ పబ్‌లో యేసు పాత్ర చేసే కామెడీకి జనం విరగబడి నవ్వుతారు. తేజస్వి తోట (అజయ్) పాత్రకి సంబంధించిన బ్యాక్ స్టొరీ బాగా కుదిరింది.
ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మాములుగా ఉండదు. సెకండాఫ్‌లో వెన్నెల కిశోర్ పాత్ర ఎంట్రీ హైలైట్ అనిపిస్తుంది. పార్క్ వ్యూ హోటల్ కి షిఫ్ట్ అయిన తర్వాత కథ ఒక్కసారిగా కీలక మలుపు తిరుగుతుంది. ఇక్కడ వచ్చే ట్విస్టులు, ఆ తరువాత అవి రివీల్ అయ్యే సీన్స్ ఉత్కంఠకు గురిచేస్తాయి. క్లైమాక్స్‌లో సత్య తన యాక్టింగ్ ట్యాలెంట్ చూపిస్తాడు. మెగాస్టార్ ‘పదహారేళ్ళ వయసు’ పాట టైమింగ్ అద్భుతం. ముగింపు చూస్తే పార్ట్ 3కి లీడ్ చేసేలా అనిపిస్తుంది.
ఇక నటీనటుల విషయానికొస్తే.. శ్రీసింహా నటుడిగా రోజురోజుకీ మెరుగవుతున్నాడు. ఈ సినిమాలో తన నటనలో మంచి ఈజ్ కనిపించింది. హీరో సైడ్ కిక్‌గా సత్య తనదైన శైలిలో నవ్వులు పూయించాడు. తన కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీలో కూడా సత్య మరోసారి చెలరేగిపోయాడు. ముఖ్యంగా శ్రీసింహాతో తన కాంబినేషన్ సీన్స్ హిలేరియస్‌గా ఉన్నాయి.
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కొత్త తరహా పాత్రలో కనిపించింది. ఇంతకుమునుపు చిత్రాల వలే కాకుండా ఇందులో డాన్సులతోపాటు ఫైట్స్ కూడా చేసింది. ఫిల్మ్ స్టార్ యువ పాత్రలో వెన్నెల కిశోర్ తన మార్క్ కామెడీ చూపించాడు. అజయ్‌కు మరోసారి మంచి పాత్ర దొరికింది. ఇక సునీల్, రోహిణి, ఝాన్సీ, రాజా చెంబోలు, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్ తదితరులు తమ పాత్రల పరిధిమేరకు డీసెంట్‌గా నటించారు.
అలాగే టెక్నీషియన్స్ విషయానికొస్తే.. కాల భైరవ అందించిన సంగీతం సినిమాకు అస్సెట్ అని చెప్పొచ్చు. సాంగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాలను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేసింది. ఇక సురేశ్ సారంగం సినిమాటోగ్రఫీ చాలా బావుంది. కార్తీక శ్రీనివాస్ షార్ప్ ఎడిటింగ్ సినిమాకు ప్లస్ అయింది. నిర్మాణ విలువలు బావున్నాయి. ఎక్కడా రాజీ పడకుండా తీశారు ప్రొడ్యూసర్స్.
ఇక మొత్తానికి మత్తు వదలరా 2 ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. ప్రస్తుతం బరిలో రాజ్ తరుణ్ ‘భలే ఉన్నాడే’, మలయాళ హీరో టోవినో థామస్ ‘ARM’ మినహా పెద్ద చెప్పుకోదగ్గ చిత్రాలేవీ లేకపోవడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. దీంతో మత్తు వదలరా 2 బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకోనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: