మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రంలో తారక్ డ్యూయెల్ రోల్స్ పోషిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అనేక సంచలనాలను క్రియేట్ చేస్తోంది. అభిమానులు సహా అందరూ ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దేవర నుంచి ఇప్పటివరకూ రిలీజ్ చేసిన సాంగ్స్ అన్నీ చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. రీసెంట్గా ముంబైలో గ్రాండ్ లెవల్లో ట్రైలర్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ ట్రైలర్‌కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. అన్నీ భాషల్లో కలిపి మిలియన్స్ వ్యూస్‌తో ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఇప్పటికే సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ నెక్ట్స్ లెవల్‌కు చేరుకున్నాయి.
ఈ నేపథ్యంలో దేవర టీమ్ డిఫరెంట్ ప్లానింగ్‌తో ప్రమోషన్స్ నిర్వహించడానికి సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా టాలీవుడ్ యంగ్ హీరోలతో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ ఇరువురూ ఎన్టీఆర్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఇందులో చిత్ర దర్శకుడు కొరటాల శివ కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి దేవర టీమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. త్వరలోనే ఈ స్పెషల్ ఇంటర్వ్యూ ప్రసారం కానున్నట్టు తెలుస్తోంది.
నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ ఆర్.రత్నవేలు, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు శిరిల్ వంటి స్టార్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు.
అలాగే దేవర చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, అజయ్, గెటప్ శీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, సాబు శిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న దేవర చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























