కంగువాతో క్లాష్ కు దిగుతున్న వేట్టాయాన్ 

Vettaiyan and Kanguva releasing on Oct 10th

సూపర్ స్టార్ రజినీకాంత్ ,సూర్య బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నారు.సూర్య కంగువా తో వస్తుండగా రజినీ వేట్టాయాన్ తోరానున్నాడు. కంగువా రిలీజ్ డేట్ ను చాలా రోజుల క్రితమే లాక్ చేశారు.రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడం తో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.అయితే సోలో రిలీజ్ కంఫర్మ్ అనుకున్న తరుణంలో అనూహ్యంగా వేట్టాయాన్ బరిలోకి దిగింది.ఈరోజే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.కంగువా దిగుతున్న రోజే అక్టోబర్ 10న ఈసినిమా కుడా వస్తుంది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


ఇక గత ఏడాది జైలర్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు రజినీకాంత్.దాంతో తన నెక్స్ట్ సినిమా వేట్టాయాన్ పై అంచనాలు పెరిగిపోయాయి.ఇప్పుడు ఈ రెండు భారీ సినిమాలు ఒకే రోజు  విడుదలకానుండడం తో క్లాష్ ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది.ఈ సినిమాలు తెలుగులో కూడా అదే రోజున విడుదలకానున్నాయి.అయితే ఆ డేట్ కు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు అయితే రావడం లేదు.ఏమైనా మీడియం బడ్జెట్ సినిమాలు వస్తే రావాలి.   

కంగువాను శివ తెరకెక్కిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్,స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్నాయి.వేట్టాయాన్ ను  జై భీం ఫేమ్ టిజి జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తుండగా అమితాబ్ బచ్చన్,రానా ,ఫహద్ ఫాజిల్, మంజు వారియర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. 

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.