పల్లకిలో పెళ్లికూతురు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్. ఆ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. ఆ తరువాత పలు సినిమాలు చేసినా కూడా మంచి విజయాన్ని అయితే దక్కించలేకపోయాయి. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మరో సినిమాతో వస్తున్నాడు. ఈసినిమాలో తండ్రి బ్రహ్మానందం కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ముక్యంగా రియల్ లైఫ్‌లో తండ్రీకొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ ఈ సినిమాలో తాతామనవళ్లుగా నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గానే ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న బ్రహ్మీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా గ్లింప్స్ ను నేడు రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేయనున్నట్టు కూడా ఇప్పటికే అప్ డేట్ ఇచ్చాడు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. గ్లింప్స్ అయితే ఆకట్టుకుంటుంది. లాస్ట్ ఇయర్ నువ్వు రాఖీ కట్టి గిఫ్ట్ అడిగితే ఏమీ ఇచ్చాను అనే గౌతమ్ డైలాగ్‌తో గ్లింప్స్ ప్రారంభమైంది. డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా గౌతమ్ కనిపిస్తున్నాడు. వెన్నెల కిశోర్ కామెడీ డాక్టర్‌గా కనిపించనున్నాడు. వీరిద్దరి కామెడీ బాగుంది. ఇక గ్లింప్స్ చివరిలో బ్రహ్మానందం ఎంట్రీ చూపించారు.
కాగా ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో ప్రియ వడ్లమాని, ఐశ్వర్య హీరోయిన్లుగా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. శాండిల్య పిసపాటి సంగీతం అందిస్తుండగా.. మితేష్ పర్వతనేని సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. ప్రసన్న ఈసినిమాకు ఎడిటర్. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్ సమర్పిస్తున్నారు. అంతేాకాదు ఈఏడాది డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు కూడా ప్రకటించారు..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























