ఉస్తాద్ రామ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో సినిమా రానుందని రీసెంట్ గా వార్తలు వచ్చాయి.ఈనెల 15న ఈ ఇద్దరు తమ లేటెస్ట్ మూవీస్ తో వచ్చారు.అందులో భాగంగా హరీష్ డైరెక్ట్ చేసిన మిస్టర్ బచ్చన్ అలాగే రామ్ నటించిన డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ అయ్యాయి.అయితే రిలీజ్ నెక్స్ట్ డే నుండి రామ్, హరీష్ శంకర్ కాంబో మరోసారి తెర మీదకు వచ్చింది.కానీ అధికారికంగా మాత్రం ఎలాంటి సమాచారం రాలేదు.ఇక ఈ న్యూస్ గురించి హరీష్ శంకర్ ఎట్టకేలకు స్పందించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ లో భాగంగా మీరు నెక్స్ట్ రామ్ తో సినిమా తీస్తున్నారనే రూమర్స్ వస్తున్నాయి అని అడిగినా ప్రశ్నకు హరీష్ బదులు ఇచ్చాడు.అవి రూమర్స్ కావు.రామ్ ను చాలా సార్లు కలిశాను.ఒక స్టోరీ కూడా చెప్పాను కానీ అది రామ్ కు అంతగా ఎక్కలేదు.మనిద్దరి కాంబో లో సినిమా అంటే ఫ్యాన్ 5స్పీడ్ లో తిరిగినట్లు వుండాలి కానీ ఇది రెండులోని ఉందని రామ్ అన్నాడు.దాంతో ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు.కానీ త్వరలోనే రామ్ తో సినిమా ఉంటుందని హరీష్ వెల్లడించాడు.
ఇక రామ్ తన నెక్స్ట్ సినిమాను ఇంకా ఫిక్స్ చేయలేదు.మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తో సక్సెస్ కొట్టి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు పి తో రామ్ తన నెక్స్ట్ సినిమా చేయనున్నాడని ప్రచారం జరుగుతుంది.మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మించనుందట.అయితే ఇప్పటివరకు ఈసినిమా గురించి అఫీషయల్ గా ఎలాంటి అప్డేట్ రాలేదు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: