బాలీవుడ్ స్టార్ హీరోయిన్, జాతీయ ఉత్తమ నటి కంగనా రనౌత్ కీలక ప్రకటన చేసింది. ఆమె ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎమర్జెన్సీ’. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తోంది కంగనా రనౌత్. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా 1975 జూన్ 25 నుండి 1977 మార్చి 21 వరకు కొనసాగిన నిర్బంధ ఎమర్జెన్సీ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెరపడింది. తాజాగా కథానాయిక కంగనా రనౌత్ ఎమర్జెన్సీ విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియాలో వెల్లడించిన ఆమె, ఈ సందర్భంగా చిత్రంలోని తన మరో లుక్ రివీల్ చేశారు. ఇప్పుడు ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఎమర్జెన్సీ కాలంలో పౌరహక్కుల అణచివేత సహా నాటి ప్రభుత్వ వ్యతిరేక నేతల అరెస్టుతోపాటు పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిలిచిన ప్రముఖ రాజకీయ వేత్త జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కనిపించనున్నారు.
అలాగే ఈ మూవీలో భూమికా చావ్లా, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్ మరియు దివంగత సతీష్ కౌశిక్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంచిత్ బల్హారా సంగీతం అందించగా, స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ రితేష్ షా అందించారు. ఎమర్జెన్సీ చిత్రాన్ని కంగనా రనౌత్ తన హోం బ్యానర్ మణి కర్ణిక ఫిలిమ్స్ బ్యానర్‌పై రేణు పిట్టితో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా కంగనా రనౌత్ ఇటీవలే తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























