సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా తన పేరును సాయి దుర్గా తేజ్ గా మార్చుకున్నాడు.వాళ్ళ అమ్మ పేరును కూడా తన పేరులో యాడ్ చేసుకున్నాడు.ఇక సినిమాల విషయానికి వస్తే గత ఏడాది విరూపాక్ష తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు ఈహీరో.ఇక అప్పటినుండి ఇప్పటివరకు మరో సినిమాను మొదలు పెట్టలేదు.అయితే విరూపాక్ష తరువాత తేజ్, సంపత్ నంది డైరెక్షన్ లో గంజా శంకర్ చేద్దాం అనుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా విడుదలచేశారు. అయితే ఆ సినిమా బడ్జెట్ కారణాల వల్ల సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయింది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించాల్సివుంది.ఇక గాంజా శంకర్ ముందుకువెళ్లే సూచనలు కనిపించకపోవడంతో తేజ్ మరో సినిమాకు సైన్ చేశాడు.
కొత్త దర్శకుడు రోహిత్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.1940లో బ్యాక్ డ్రాప్ లో రానుంది. ఈసినిమాను భారీ బడ్జెట్ తో హనుమాన్ నిర్మించిన నిరంజన్ రెడ్డి నిర్మించనున్నాడు.పాన్ ఇండియా మూవీ గా రానుంది. ఈనెల 30న ఈసినిమా రామానాయుడు స్టూడియోస్ లాంచ్ కానుంది.జూన్ 20నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.ఈఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























