రీసెంట్ మలయాళం బ్లాక్ బాస్టర్ ప్రేమలు అదే టైటిల్ తెలుగులోకి డబ్ అయ్యి ఇక్కడ కూడా అదరగొడుతుంది.స్ట్రెయిట్ తెలుగు సినిమాలను డామినేట్ చేస్తూ రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది.ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను కావడం తో ఫుల్ రన్ లో భారీ లాభాలను తీసుకురానుంది.ట్రెండ్ చూస్తే ఫుల్ రన్ లో ప్రేమలు 10కోట్ల వరకు రాబట్టుకోవచ్చు.ఎస్ ఎస్ కార్తికేయ ఈసినిమాను తెలుగులో విడుదలచేశాడు.అటు మలయాళంలో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 105కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటిటి హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది.మలయాళంతో పాటు తెలుగు,తమిళ, కన్నడ ,హిందీ భాషలకు గాను ఈ హక్కులను సొంతం చేసుకుంది.మార్చి 29న ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకురానుందని సమాచారం అయితే తమిళ వెర్షన్ థియేటర్లో విడుదలకావాల్సి వుంది దానికి తోడు తెలుగు,మళయాలంలో ప్రస్తుతం సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది దాంతో 29న వచ్చేది డౌటే.త్వరలోనే ఈ స్ట్రీమింగ్ డేట్ విషయంలో క్లారిటీ రానుంది.
హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈసినిమాలో మమితా బైజు,నస్లేన్,సంగీత్ ప్రతాప్, అఖిల బార్గవన్ లీడ్ రోల్స్ లో నటించగా విష్ణు విజయ్ సంగీతం అందించాడు.గిరీష్ ఏడి ఈసినిమాను డైరెక్ట్ చేయగా ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ తన స్నేహితులతో కలిసి ఈసినిమాను నిర్మించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























