ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు వీడియోలను రిలీజ్ చేయగా అవి ఏరేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయో చూశాం. ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ఈమధ్యే ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే కదా. మే 9వ తేదీన ఈసినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా గురించి నాగ్ అశ్విన్ ఇప్పటికే పలు ఆసక్తికర వ్యాఖ్యలు తెలియచేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈసినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ్ అశ్విన్ ఈ కల్కి 2898 ఏడీ మూవీ 6 వేల సంవత్సరాల టైమ్ లైన్ తో ఉండబోతోందని.. సినిమా మహాభారతంతో మొదలై 2898 ఏడీ సంవత్సరంలో ముగుస్తుందని.. అంటే 6000 సంవత్సరాల కాలం సాగుతుంది.. ఆ ప్రపంచాలు ఎలా ఉంటాయన్నది చూపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అంతేకాదు కృష్ణుడి చివరి అవతారం కల్కి అని, టైమ్ పీరియడ్‌లో 2898ఏడీ నుంచి 6000 సంవత్సరాలు బ్యాక్ వెళితే కల్కి మరణం వరకు 3100బీసీకి వెళ్తుందని వెల్లడించారు. మొదటి పార్ట్ `కల్కి2898ఏడీ` అనే టైటిల్ పెట్టడానికి కారణం ఇదే నాగ్ అశ్విన్ వెల్లడించారు. ఇక నాగ్ ఆశ్విన్ చేసిన ఈ వ్యాఖ్యలతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























