మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ నిన్న విడుదలై పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ హిట్ మౌత్ టాక్ ను సొంతం చేసుకుంది.దాంతో మొదటి రోజు సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు ఈసినిమా 11.90కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఇందులో షేర్ 5.48కోట్లు.ఎలాగూ ఈరెండు రోజులు వీకెండ్ కాబట్టి ఇదే జోరు కొనసాగించనుంది దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను 80శాతం పూర్తి చేయనుంది.ఓవర్సీస్ లో ఈసినిమా 150k మార్క్ నుక్రాస్ చేసింది.ఇప్పట్లో పెద్ద సినిమాల విడుదలకూడా లేకపోవడంతో ఈగల్ కు కలిసిరానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక చాలా రోజుల తరువాత రవితేజ,ఈగల్ తో హిట్ కొట్టి కం బ్యాక్ ఇచ్చాడు.కార్తిక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈసినిమాలో అనుపమా పరమేశర్వన్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించగా రవితేజకు జోడిగా కావ్య థాపర్ నటించింది.దేవ్ జాన్డ్ సంగీతం అందించాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈసినిమాను నిర్మించింది. ముఖ్యంగా చివరి 40నిమిషాలు సినిమాకు హైలెట్ గా నిలిచింది.హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను థ్రిల్ చేశాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: