మరో భాషలో కూడా బేబి రీమేక్

baby movie get remake in tamil language too

చిన్న సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది బేబి సినిమా. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రావడంతో యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఇక హిట్ అయిన సినిమాలను పలు భాషల్లో రీమేక్ చేయడం అనేది ఇప్పుడు కామన్ గా మారిపోయింది. ఇక ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తారని గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఈసినిమాను మరో భాషలో కూడా రీమేక్ చేస్తున్నారు. ఈసినిమా నిర్మాత అయిన ఎస్కేన్ ఒక సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేబి సినిమా గురించి కూడా తెలిపారు. బేబి సినిమాను హిందీ తో పాటు తమిళంలో కూడా రీమేక్ చేయబోతున్నామంటూ తెలిపారు. మరి తమిళ్ లో ఏ హీరో ఈ రీమేక్ లో నటిస్తాడో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా సాయి రాజేష్ దర్శకత్వంలో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విని ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా బేబి. ఈసినిమాను మాస్ మూవీ మేకర్స్‌పై ఎస్‌కేఎన్ నిర్మించారు. సినిమాకు విజయ్ బుల్ గానిన్ సంగీతం అందించారు. కాగా సినిమాటోగ్రాఫర్ గా బాల్ రెడ్డి, ఎడిటర్ గా విప్లవ్ నైషధం పనిచేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.