పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు, మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరిహర వీరమల్లు’ సినిమాల్లో కథానాయకుడిగా నటిస్తోన్న విషయం తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలు వచ్చే ఏడాదిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. కాగా ఇవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలు కావడం, వీటిని మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ఈ సినిమాలపై అంచనాలు స్కై లెవెల్లో ఉన్నాయి. ఇక ఈ చిత్రాలతో పాటుగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమాకు కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం వెలుగు చూసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ పవర్ స్టార్ నటించనున్న ఈ కొత్త సినిమాకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. కాగా వంశీ ఈ చిత్రానికి కథ అందించనుండడం గమనార్హం. నితిన్, శ్రీలీల జంటగా నటించగా.. ఆయన దర్శకత్వం వహించిన ‘ఎక్స్ట్రా-ఆర్డినరీ మ్యాన్’ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా వంశీ ఒక యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమా ఇతివృత్తం గురించి వివరించారు. ఇది ప్రధానంగా సోషల్ సెటైరికల్‌గా ఉంటుందని తెలిపారు. ఈ స్టోరీ పవన్ కళ్యాణ్ కు వినిపించిన సందర్భం తనకు బాగా గుర్తుందని చెప్పిన వక్కంతం.. కథ వినగానే పవర్ స్టార్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారని, ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలెడదామా.. అని ఎగ్జయిట్ అయ్యారని చెప్పారు.
A right script for the right person!🔥
Writer @VamsiVakkantham‘s comment about Power star @PawanKalyan‘s film with @DirSurender!✍️#PawanKalyan #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/wySvPiFoGf— Telugu FilmNagar (@telugufilmnagar) December 7, 2023
కాగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో రూపొందే ఈ సినిమాపై కూడా పవర్ స్టార్ అభిమానుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. దీనికి కారణం.. సురేందర్ రెడ్డి ఇంతకుముందు ముగ్గురు మెగా హీరోలతో హిట్ సినిమాలు తీయడమే. అల్లు అర్జున్ తో ‘రేసు గుర్రం’, రామ్ చరణ్ తో ‘ధ్రువ’, మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలకు దర్శకత్వం వహించింది సురేందర్ రెడ్డే. ఇక్కడ మరో ముఖ్యమైన విశేషం ఏంటంటే..? సురేందర్ రెడ్డి తీసిన చాలా సినిమాలకు కథ అందించింది వక్కంతం వంశీనే. దీంతో మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే ధీమాలో ఉన్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: