ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

extra ordinary man movie interesting elements

వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈసినిమా మరో ఒక్క రోజులో ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దానికితోడు ఇప్పటివరకూ రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి బజ్ నే క్రియేట్ చేశాయి. మరోవైపు ఈ సినిమాపై మంచి నమ్మకంతోనే ఉన్నాడు నితిన్. మరి ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నితిన్
జయాపజయాలను పట్టించుకోకుండా నితిన్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. చాలా గ్యాప్ తరువాత నితిన్ మళ్లీ కామెడీ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. ఇది నితిన్ కు కలిసొచ్చే జోనరే. తనలో కామెడీ యాంగిల్ ను ఇప్పటికే పలు సినిమాల్లో చూపించాడు నితిన్. ఈసారి కూడా అదే జోనర్ తో వస్తుండటం ఈసినిమాకు కలిసొచ్చే అంశం.

శ్రీలీల
ఈసినిమాలో సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే శ్రీలీల తన మార్క్ ను చూపించుకుంది ఇండస్ట్రీలో. కుర్ర హీరోల దగ్గరనుండి సీనియర్ హీరోల వరకూ అందరినీ కవర్ చేస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. తన ఎనర్జిటిక్ నటన, సూపర్ డ్యాన్స్ తో చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఈసినిమాలో కూడా తన నటన, డ్యాన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ అయ్యేలా కనిపిస్తుంది.

కథ
ఈసినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నాడు. కాస్త సీరియస్ బ్యాక్ డ్రాప్ లో కాకుండా ఈసారి కామెడీ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. జీవితంలో హీరోగా ఎదగాలనుకునే ఓ కుర్రాడు, చిన్నతనం నుంచి తనలా కాకుండా ప్రతిరోజు డిఫరెంట్ లైఫ్ ని లీడ్ చేయాలని అనుకుంటాడు. అలా సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా మారుతాడు. ఆ క్రమంలోనే ఒక సమస్యలో ఇరుక్కుంటాడు. దాని నుండి ఎలా బయటపడతాడు అనేది కథ. ఈసినిమాలో నితిన్ ను జూనియర్ ఆర్టిస్ట్ గా చూపిస్తూ తనతో కామెడీ చేయించే ప్రయత్నం చేశాడు.

సంగీతం
ఈసినిమాకు హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతంచేసుకున్నాయి. అంతేకాదు టీజర్, ట్రైలర్ లను బట్టి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఇది కూడా ఈసినిమాకు కలిసొచ్చేలా ఉంది.

మరి ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ కు ఈసినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + twelve =