ప్రేమ విమానం ట్రైలర్ రిలీజ్

prema vimanam movie trailer out now

సంతోష్‌ కట దర్శకత్వంలో సంగీత్ శోభ‌న్‌, శాన్వి మేఘ‌న హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ప్రేమ విమానం. న్యూ ఏజ్‌ లవ్‌ స్టోరీ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. అయితే ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ కానుంది. అక్టోబర్ 13న ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ను బట్టి అనసూయ, రవివర్మకు ఇద్దరు పిల్లలు.. విమానం ఎక్కాలని కలలు కనే ఆ పిల్లలు ఏం చేశారు.. మరోవైపు పెద్దింటి అమ్మాయైన సాన్వీని సంగీత్ ప్రేమిస్తాడు. అయితే సంగీత్ తండ్రి అతడిని దుబాయ్ పంపించాలని అనుకుంటాడు. ఇలా రెండు కథలను కనెక్ట్ చేస్తూ ఈ సినిమా సాగనుందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

కాగా ఇంకా ఈసినిమాలో దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, అన‌సూయ‌, వెన్నెల కిషోర్ ఇత‌ర‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు అనూప్‌రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నాడు. జగదీష్‌ చీకటి కెమెరామెన్‌. అభిషేక్‌ పిక్చర్స్‌, జీ5తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.