హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి సినిమాను ప్రకటించినప్పటి నుండే అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తిచేసే పనిలో పడింది. పవన్ కళ్యాణ్ కూడా రీసెంట్ గా మళ్లీ షూట్ లో పాల్గొనగా పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు అలానే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా పవర్ స్టార్ స్వాగ్, డైలాగ్, లుక్ కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా అప్పుడప్పుడు ఈసినిమా గురించి నెటిజన్లు అడిగే ప్రశ్నలకు హరీష్ రిప్లైలు ఇస్తాడన్న సంగతి తెలిసిందే కదా. ఇక తాజాగా మరో నెటిజన్ కు తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. ఓ అభిమాని తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ 50 శాతం పూర్తయిందట కదా అన్నా.. ఇంకా క్వాలిటీ ఆ దేవుడు మీదే భారం వేశాం అంటూ ట్వీట్ చేశాడు. ఇక ట్వీట్ కు హరీష్ శంకర్ సమాధానంగా అంతేకదా తమ్ముడు అంతకు మించి నువ్వేమి చేయగలవు అంటూనే ఈ గ్యాప్ లో జాబ్, కెరీర్ పై ఫోకస్ పెట్టమని సలహా ఇచ్చాడు. దీంతో ఇప్పుడు హరీష్ శంకర్ ఇచ్చిన రిప్లై వైరల్ అవుతుంది.
Anthe kadha thammudu anthaku
Minchi nuvvemi cheyagalavu cheppu… ??
ee loga kaasta career, job, studies meedha focus pettu vaatini maatram devudiki odileyaku…. All the Best !! https://t.co/wWkk1T0Wyd— Harish Shankar .S (@harish2you) September 20, 2023
కాగా ఈసినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























