‘సప్త సాగరాలు దాటి’.. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఇవే..!

Saptha Sagaralu Dhaati Most Interesting Elements of Emotional Rider

సాధారణంగా ఎక్కువ సినిమాలు ప్రేక్షకులకు తక్కువ కాలం గుర్తుంటాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఎన్ని సంవత్సరాలు గడిచినా.. స్మృతిపథంలో మెదులుతూ ఉంటాయి. ప్రేక్షకులు సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తు చేసుకుని మైమరిచిపోయేలా చేస్తాయి. అలాంటివాటిలో ఎక్కువగా ప్రేమ కథలే ఉంటాయి. ఈ కోవలో వచ్చిందే ‘సప్త సాగరాలు దాటి’ సినిమా. కన్నడనాట యువతరాన్ని ఉర్రుతలూగించిన రొమాంటిక్ లవ్ స్టోరీ ‘సప్త సాగరదాచే ఎల్లో: సైడ్‌-ఏ’. తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’ అనే పేరుతో మరో రెండు రోజుల్లో విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘777 చార్లీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన ఈ సినిమా కన్నడనాట సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో రక్షిత్‌ సరసన రుక్మిణి వసంత్ కథానాయికగా నటించారు. లవ్ స్టోరీ నేపథ్యం కలిగి ఉండటంతో యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ప్రేమ కథ రాలేదని కన్నడనాట ప్రేక్షకులు కితాబునివ్వడం గమనార్హం. దీంతో ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఇటీవలే సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. దీనిని చూస్తుంటే.. ఇదొక అద్భుతమైన విజువల్ అండ్ మ్యూజికల్ లవ్ స్టోరీ అనే ఫీల్ కలుగుతోంది. పెళ్లి చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కలలు కనే ఓ జంట జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను ఇందులో హృద్యంగా చూపించారు.

ఈ చిత్రాన్ని ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. సెప్టెంబర్ 22న పెద్ద ఎత్తున థియేటర్లలో విడుదల చేయనున్నారు. కాగా హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించిన ‘సప్త సాగరదాచే ఎల్లో’ రెండు భాగాలుగా రూపొందింది. తొలిభాగం సెప్టెంబర్ 1న థియేటర్లలోకి రాగా.. రెండో భాగం అక్టోబర్ 20న విడుదల కానుంది. గుండు శెట్టి ఈ సినిమాకు సహ రచయితగా వ్యవహరించగా.. అద్వైత గురుమూర్తి ఛాయాగ్రహణం అందించారు. చరణ్ రాజ్ అందించిన మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయింది. ఇక ఈ సినిమాను హీరో రక్షిత్‌ శెట్టి తన స్వంత బ్యానర్‌పై నిర్మించడం విశేషం.

ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటంటే..?

  • మధ్య తరగతికి చెందిన ఇద్దరు యువతీ, యువకుల కథే ఇది.
  • మను (రక్షిత్‌ శెట్టి), ప్రియ (రుక్మిణి వసంత్) ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు.
  • ప్రియకి సముద్రం అంటే చాలా చాలా ఇష్టం.
  • పెళ్లి చేసుకుని బీచ్ పక్కన ఒక అందమైన ఇల్లు కట్టుకుని హ్యాపీగా జీవించాలని అనుకుంటారు.
  • అయితే ఒక సమయంలో వీరు తీసుకున్న ఓ అనాలోచిత నిర్ణయం వలన జీవితం తల్లకిందులు అవుతుంది.
  • ఈ క్రమంలో అనుకోకుండా మను జైలుకి కూడా వెళ్లాల్సి వస్తుంది.
  • అసలు మను జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఆ తర్వాత ఏం జరిగింది?
  • జైలు నుంచి మను మళ్ళీ బయటకు రాగలిగాడా? లేదా? ఈ నేపథ్యంలో వారికి ఎదురైన సమస్యలేంటి?
  • వీళ్ల ప్రేమకథకు అడ్డంకి ఏంటీ ?.. అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.