యూఎస్ లో తగ్గని మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి జోరు

miss shetty mr polishetty usa collections report

కొన్ని రిలీజ్ కు ముందు వరకూ ఎలా ఉన్నా.. రిలీజ్ తరువాత మాత్రం మంచి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తాయి. అలాంటి సినిమానే రీసెంట్ రిలీజ్ అయిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. మహేష్ బాబు. పి దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క, టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో ఈసినిమా వచ్చింది. అనుష్క, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ తో పాటు ముఖ్యంగా నవీన్ కామెడీ టైమింగ్ కు మాత్రం అందరూ ఫిదా అవుతున్నారు. అందుకే ఈసినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు సైతం కనెక్ట్ అయి మంచి ఆదరణను దక్కించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక కలెక్షన్స్ పరంగా కూడా డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది ఈసినిమా. ఈసినిమా రిలీజ్ టైమ్ లో పలు సినిమాలు ఉన్నా కానీ ఆ కాంపిటీషన్ తట్టుకొని ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అలా ముడో వారంలోకి కూడా అడుగుపెట్టేసింది ఈసినిమా. ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా 41 కోట్ల గ్రాస్ ను 21 కోట్ల నెట్ ను సొంతం చేసుకొని మంచి లాభాలనే అందించింది అని చెప్పొచ్చు. ఇక ఇక్కడ మాత్రమే కాదు యూఎస్ఏ లో కూడా ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి అక్కడి ఆడియన్స్ కు ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. అందుకే అక్కడ కూడా ఇంకా మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది. తాజాగా ఈసినిమా 1.6డాలర్లకు పైగా కలెక్షన్స్ ను అందుకుంది.

కాగా ఈసినిమాలో ఇంకా జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.