50 కోట్ల క్లబ్ లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి

miss shetty mr polishetty movie joins in 50 crore club

మొత్తానికి అనుష్క చాలా గ్యాప్ తరువాత వచ్చి మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది. మహేష్ బాబు.పి దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరో గా వచ్చిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. రిలీజ్ కు ముందు నుండీ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఈసినిమా రిలీజ్ అయి ఫస్ట్ షో నుండే డీసెంట్ టాక్ నే తెచ్చుకుంది. డిఫరెట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రావడంతో అందులోనూ కామెడీ కూడా ఉండటంతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకొని మంచి ఆదరణను దక్కించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక కలెక్షన్స్ పరంగా ఈసినిమా సైలెంట్ గా సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతుంది. దాదాపు 12.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయిన ఈసినిమా అతి తక్కువ రోజుల్లో బ్రేక్ ఈవెన్ చసి లాభాలను అందించింది. ఇప్పుడు ఈసినిమా 50 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ కూడా తెలియచేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ ఏడాది బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్.. ఇలాంటి విజయం అందించిన లవ్లీ ఆడియన్స్ ను థ్యాంక్స్.. మా జర్నీలో మరో బ్లాక్ బస్టర్ ను అందించారు.. ఈసినిమా 50 కోట్ల కలెక్షన్స్ ను దాటింది అంటూ చిత్ర నిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

కాగా ఈసినిమాలో ఇంకా జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.