మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి బిగ్గెస్ట్ యూఎస్ఏ ఓపెనింగ్

miss shetty mr polishetty biggest usa opening

ఈ ఏడాది రాబోతున్న సినిమాల్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన కాంబినేషన్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. మహేష్ బాబు.పి దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా, నవీన్ పోలిశెట్టి హీరోగా ఈసినిమా వచ్చింది. ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కాబట్టి సినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఫైనల్ గా భారీ అంచనాలతో ఈసినిమా రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈసినిమాలో అనుష్క, నవీన్ పోలిశెట్టి ఇద్దరూ తమ నటనతో ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా దాదాపు 3కోట్ల వరకూ షేర్ ను అందుకుంది. ఇక్కడ మాత్రమే కాదు యూఎస్ లో కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది. యూఎస్ఏలో 193కే డాలర్లను రాబట్టుకొని అక్కడ బెస్ట్ ఓపెనింగ్ ను అందుకుంది.

కాగా ఈసినిమాలో ఇంకా జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు.

కథ విషయానికి వస్తే.. ప్రేమ, పెళ్లి పై మంచి ఒపీనియన్ లేని అన్విత (అనుష్క) ఒక బిడ్డకి తల్లి కావాలనుకుంటుంది. అలా ప్రయత్నిస్తున్న సమయంలోనే సిద్దూ(నవీన్ పోలిశెట్టి)ని చూస్తుంది. తను అయితే కరెక్ట్ గా ఉంటుందని స్పెషల్ కేర్ తీసుకుంటుంది. అంతేకాదు తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి కూడా తెలుసుకుంటుంది. మరోవైపు ఇవన్నీ చూసిన సిద్దూ అన్వితకు ప్రపోజ్ చేస్తాడు. దాంతో అన్విత అసలు విషయం సిద్దూ కి చెబుతుంది. నిజం తెలుసుకున్న సిద్దూ తరువాత ఏం చేస్తాడు.. అన్విత ప్రపోజల్ కు ఒప్పుకుంటాడా? లేక ప్రేమ అంటే నమ్మకంలేని అన్వితనే సిద్దూ ప్రేమలో పడుతుందా అనేది మిగిలిన కథ.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.