ఉస్తాద్ రామ్ పోతినేని,డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్.రీసెంట్ గా ఈసినిమా మొదటి షెడ్యూల్ ముంబై లో సార్ట్ కాగా ఈరోజుతో ముగిసింది.ఈషెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈసినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు.మొదటి షెడ్యూల్ షూటింగ్ లో కూడా ఆయన పాల్గొన్నాడు.ఇక తదుపరి షెడ్యూల్ విదేశాల్లో జరుగనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో రామ్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు.ఇటీవల రామ్ లుక్ రివీల్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకి హీరోయిన్,మ్యూజిక్ డైరెక్టర్ ను ఫైనల్ చేయాల్సివుంది.పూరి కనెక్ట్స్ బ్యానర్ ఫైపూరి జగన్నాథ్,ఛార్మి నిర్మిస్తున్న ఈసినిమా వచ్చే ఏడాది మార్చి 8న తెలుగుతోపాటు ఇతర భాషల్లో విడుదలకానుంది.గతంలో రామ్,పూరి కాంబో లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ హిట్ అవ్వడంతో ఈడబుల్ ఇస్మార్ట్ ఫై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























