తండ్రికి తగ్గ తనయ- చిన్న వయసులో పెద్ద మనసు

sitara ghattamaneni shows her kind heart

సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అని నిరూపించుకున్న సందర్భాలు ఎన్ని ఉన్నాయో తెలిసిందే కదా. తను చేసే సేవా కార్యక్రమాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీమంతుడు సినిమా స్పూర్తితో ఇప్పటికే మహేష్ పలు గ్రామాల్ని దత్తత తీసుకొని వాటిని అభివృద్ది చేయడంలో కృషిచేస్తున్నాడు. ముఖ్యంగా ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్ లు చేయించడం అనేది మరో ఎత్తు. ఒకటి కాదు రెండు కాదు ఇప్పటివరకూ వేయికి పైగా ఎంతోమంది చిన్నారి గుండెలకు మహేష్ ఆయువుపోశాడు. ఇవే కాదు ఎన్నో తెలియని సేవలు కూడా చేస్తుంటాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు సితార కూడా తండ్రి జాడల్లోనే నడుస్తూ తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంది. నేడు సితార పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో సితారకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు అందుతున్నాయి. అయితే ఈసారి తన పుట్టినరోజును సితార చాలా ప్రత్యేకంగా జరుపుకున్నారు. మహేష్ బాబు ఏర్పాడు చేసిన పౌండేషన్ లోని పేద పిల్లలతో తన పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా అక్కడ పేద ఆడపిల్లలు సైకిళ్లను విరాళంగా అందించి ఇంత చిన్న వయసులో తన పెద్ద మనసును చాటుకుంది. ఇక ఈవీడియోను నమ్రతా కూడా తన ఇన్ట్సా ద్వారా పోస్ట్ చేస్తూ.. ఇతరులపై ప్రేమను చూపించే గొప్ప మనసు నీకు ఉంది.. ఇలాంటి అర్థవంతమైన మధుర సందర్భాలు ఎన్నో చోటుచేసుకోవాలని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.

కాగా ఈఏడాది సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు మహేష్. ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.