ప్రాజెక్ K ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

prabhas project k movie first glimpse out

మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ వెయిట్ చేస్తున్న తరుణం వచ్చేసింది. ప్రాజెక్ట్ కే.. గత కొద్దిరోజులుగా ఈసినిమా గురించే సోషల్ మీడియాలో చర్చలు. అంతేకాదు గత కొద్దిరోజుల నుండి ప్రాజెక్ట్ కే సోషల్ మీడియాలో టాప్ ట్రెడింగ్లో నిలుస్తుంది. దానికి కారణం ఈసినిమా నుండి రాబోయే అప్ డేట్ కోసమే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోతున్న ఈసినిమా పై అంచనాలు ఏరేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. మరోవైపు షూటింగ్ దశలోనే ఈసినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలో తాజాగా చిత్రయూనిట్ అంతా యూఎస్ఏ లో శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొంటుంది. ఇక అక్కడే ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఫస్ట్ గ్లింప్స్ అయితే అదిరిపోయింది. సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. చివరిలో ప్రాజెక్ట్ కే అంటే కల్కి అని రిలీవ్ చేశారు మేకర్స్. ఒక్కసారిగా విజువల్స్ ను చూస్తే హాలీవుడ్ సినిమాను చూస్తున్నామా అన్న సందేహం అయితే రాక మానదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్. నాగ్ అశ్విన్ బ్రిలియంట్ మేకింగ్ మార్క్ మరోసారి ఈసినిమాతో చూపించనున్నాడని అర్థమవుతుంది. చూడబోతే ప్రభాస్ ఈసినిమాతో పెద్ద ప్రభంజనమే సృష్టించేలా కనిపిస్తున్నాడు.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది. మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్‌ డైరెక్టర్‌ గా వర్క్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.