జులై నెలలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న బ్రో సినిమా గురించి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో మొదటి నుండీ మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి ఈసినిమాపై. ఫైనల్ గా జులై 28వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ కు మరేన్నో రోజులు లేదు. మరోవైపు ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ. దీనికి తోడు రిలీజ్ చేసిన అప్ డేట్లు అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా టీజర్ అయితే సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. మామ అల్లుళ్ల కెమిస్ట్రీ ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని అర్థమైంది. ఇప్పుడు అందరూ చూస్తుంది ట్రైలర్ కోసం. ఈనేపథ్యంలోనే ఈసినిమా ట్రైలర్ రిలీజ్ అప్ డేట్ కూాడా వచ్చేసింది. జులై 21వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్దమయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా డైరెక్టర్ కమ్ నటుడు సముద్రఖని దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. తాను తమిళంలో తీసి సూపర్ హిట్ ను అందుకున్న వినోదయ సీతం అనే సినిమాను ఇక్కడ బ్రో టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు. ఈసినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు పలు కీలకపాత్రల్లో నటించనున్నారు. కాగా కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగులు స్క్రీన్ ప్లే.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































