ఉస్తాద్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఇస్మార్ట్ శంకర్.2019లో వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది.రామ్ బాడీ లాంగ్వేజ్,డైలాగ్ డెలివరీ సినిమాలో హైలైట్ అయ్యాయి.సినిమాలోని రామ్ లుక్ కూడా ట్రెండ్ సెట్ చేసింది.ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వస్తుంది.డబుల్ ఇస్మార్ట్ తో తెరకెక్కుతున్న ఈసినిమా నిన్న లాంచ్ కాగా రేపటి నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.ఈసినిమా కోసం రామ్ మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ లుక్ లోకి మారాడు.అందుకు సంబందించిన ట్రాన్స్ఫర్మేషన్ వీడియోను కొద్దీ సేపటి క్రితం విడుదలచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇస్మార్ట్ గా సెగలు పుట్టిస్తున్న ఉస్తాద్🔥
A transformation that will transport you to the world of #DoubleISMART 🤙Ustaad @ramsayz is back to Banger Avatar as #IsmartShankar to give you all DOUBLE IMPACT🔥
Madness begins on the sets TOMORROW❤️🔥
In cinemas on MARCH 8th, 2024💥… pic.twitter.com/fzNzQuTmQA— Telugu FilmNagar (@telugufilmnagar) July 11, 2023
ఇస్మార్ట్ శంకర్ తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చిన డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ డబుల్ ఇస్మార్ట్ తో మళ్ళీ అదే ఫలితాన్ని రిపీట్ చేయాలనే పట్టుదలతో వున్నాడు.పూరి కనెక్ట్స్ బ్యానర్ ఫై పూరి జగన్నాథ్,ఛార్మి కౌర్ నిర్మిస్తుండగా వచ్చే ఏడాది మార్చి 8న డబుల్ ఇస్మార్ట్ తెలుగుతోపాటు తమిళ,కన్నడ,మలయాళ హిందీ భాషల్లో విడుదలకానుంది.
అయితే ఈసినిమా కన్నా ముందు రామ్ స్కంద తో థియేటర్లలోకి రానున్నాడు.బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో కూడా రామ్ డిఫ్రెంట్ లుక్ లో కనిపించనున్నాడు.శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈసెప్టెంబర్ 15న స్కంద థియేటర్లలోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























