ఏస్ మ్యూజిక్ కంపోజర్ థమన్ గత కొంత కాలంగా గుంటూరు కారం గురించి వినిపిస్తున్న రూమర్స్ పై స్పందించాడు. ఈసినిమా మ్యూజిక్ డైరెక్టర్ మారనున్నాడని ఎప్పటి నుండో వార్తలు వస్తూనే వున్నాయి.ఇంకా అవి ఆగకపోవడంతో ఎట్టకేలకు ఈ రూమర్స్ గురించి థమన్ స్పందించాడు.నన్ను తీసేస్తే నిర్మాతలు చెప్తారు కదా అలాంటిదేం లేదు.సినిమా ఆలస్యం అవుతుంది.గత ఆరు నెలలుగా ఈసినిమా కోసం పనిచేస్తున్నా.స్క్రిప్ట్ లో మార్పులు చేయడంతో దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.అందరూ ఎందుకు ఈ సినిమాపై పడ్డారో తెలియడం లేదని థమన్ అన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గుంటూరు కారం షూటింగ్ ప్రస్తుతం బిహెచ్ఈఎల్ లో జరుగుతుంది.ఈ షెడ్యూల్ స్టంట్ మాస్టర్ అనల్ అరసు నేతృత్వంలో యాక్షన్ సీన్స్ తెరకెక్కుతున్నాయి.ఈషెడ్యూల్ తరువాత మహేష్ చిన్న బ్రేక్ తీసుకొని ట్రిప్ కు వెళ్లనున్నాడు.స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో పూజా హెగ్డే ,శ్రీలీల హీరోయిన్లు గా నటిస్తున్నారు.హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదలకానుంది.క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: