మెగా కాంపౌండ్ నుండి వచ్చీ కూడా తన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. మొదట కాస్త తన సినిమాలు అటూ ఇటూ అయినా ఫిదా నుండి తన సక్సెస్ రేటును పెంచుకుంటూ వెళ్లాడు. ఫిదా నుండి గని వరకూ ఏదో ఒకటి రెండు సినిమాలు అటూ ఇటూ అయి ఉంటాయి తప్పా చాలా వరకూ విజయాలే అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాండీవధారి అర్జున. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌తోనే ఈ సినిమాపై అంచనాలు పెంచేసారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. ఈసినిమా షూటింగ్ ఎక్కువ భాగం విదేశాల్లోనే జరిపారు చిత్రబృందం. తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా షూటింగ్ అయిపోయిందని అధికారికంగా తెలియచేశారు. వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టి చెప్పిన డేట్ కే సినిమాను రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Execution DONE 😎
Making every SHOT count for AUGUST 25th🔥Team #GandeevadhariArjuna wraps up the shoot & all geared up for the blazing action in cinemas 💥💥#GDAonAug25th ❤️🔥@IAmVarunTej @sakshivaidya99@PraveenSattaru @MickeyJMeyer @BvsnP @SVCCofficial @jungleemusicSTH pic.twitter.com/DVYxyh320s
— SVCC (@SVCCofficial) June 28, 2023
కాగా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని నాగబాబు సమర్పణలో శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈసినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. ముఖేష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























