పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సుప్రీం హీరో సాయి తేజ్ మొదటి సారి కలిసి నటిస్తున్న చిత్రం బ్రో.కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ వినోదయం సీతంకు రీమేక్ గా తెరకెక్కుతుంది.సముద్రఖని దర్శకుడు.షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది.ఇంకో సాంగ్ షూట్ బ్యాలెన్స్ వుంది.ఇటీవల ఈసినిమానుండి విడుదలైన పోస్టర్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమా టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఎట్టకేలకు వారి ఎదురుచూపులకు తెరపడనుంది.టీజర్ కట్ కూడా అయిపోయింది.ప్రస్తుతం సీజీ వర్క్ జరుగుతుంది.అతి త్వరలో టీజర్ ఎప్పుడు రిలీజ్ కానుందో ప్రకటించనున్నారు.అంతేకాదు సినిమా విడుదలకు సమయం కూడా దగ్గర పడుతుండడంతో నాన్ స్టాప్ గా ప్రమోషన్స్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Gear up for a MASSive Treat 💥💥 POWER STORM On The Away 🔥🔥
Much Awaited #BRO Teaser Announcement Loading…⌛⌛#BroTheAvatar #BROTeaser @PawanKalyan @IamSaiDharamTej @thondankani @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla @TheKetikaSharma @NavinNooli @peoplemediafcy… pic.twitter.com/fBa8mT2KmM
— Telugu FilmNagar (@telugufilmnagar) June 24, 2023
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఈసినిమాకు మాటలు అందిస్తుండగా ప్రియా ప్రకాష్ వారియర్,కేతిక శర్మ,బ్రహ్మజీ,తణికెళ్ల భరణి ,రోహిణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.థమన్ సంగీతం అందిస్తున్నాడు.భారీ అంచనాల మధ్య వచ్చే నెల 28న బ్రో థియేటర్లోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























