బాలీవుడ్ లో రేర్ ఫీట్- ప్రభాస్ కే అది సాధ్యం

prabhas is the only one south hero to achieve rear feet in bollywood

సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా తన కటౌట్ తోనే కోట్లను రాబట్టుకునే హీరో ప్రస్తుతం ఎవరైనా ఉన్నారంటే అది పాన్ ఇండియా స్టార్ ప్రభాసే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా 2002 లో ‘ఈశ్వర్’ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు ప్రభాస్. మొదటి సినిమా అంత విజయం దక్కించుకోలేకపోయినా ప్రభాస్ కు మాత్రం మంచి గుర్తింపే వచ్చింది. ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్రరావు సినిమా కూడా విజయం ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన వర్షం సినిమా ప్రభాస్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయింది. ప్రభాస్, త్రిష కాంబినేషన్ లో వచ్చిన ‘వర్షం’ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఆతరువాత పలు సినిమాలు చేసినా అవేమి సక్సెస్ ను అందించలేదు. ఇక 2005లో వచ్చిన ఛత్రపతి సినిమా ప్రభాస్ మాస్ హీరోగా ప్రభాస్ ను నిలబెట్టింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో అనేక రికార్డులు సాధించింది. ాఆ తరువాత బాహుబలి వరకూ పలు సినిమాలు తీశాడు. వాటిలో కొన్ని హిట్స్ ను అందించాయి.. కొన్ని పరాజయాన్ని అందించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఒక్క బాహుబలి సిరీస్ తో ప్రభాస్ సినీ తలరాతనే మార్చేసింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి1, బాహుబలి2 సంచలన విజయాలు సాధించాయి. ఇక ఈసినిమాతో ప్రభాస్ రేంజ్ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా పెరిగిపోయింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఇండియా మార్కెట్ ను ఏలుతున్నాడు. సినిమా టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద సత్తా చూపిస్తున్నాడు. నిజానికి బాహుబలి సినిమా తరువాత వచ్చిన సాహో సినిమా అలానే గత ఏడాది రిలీజ్ అయిన రాధేశ్యామ్ సినిమాలు రెండూ కూడా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. కానీ నార్త్ లో మాత్రం ఈ రెండు సినిమాలు 100 కోట్ల క్లబ్ లోకి వెళ్లాయి.

రీసెంట్ గా వచ్చిన ఆది పురుష్ కూడా అంతే. సినిమా రిలీజ్ అయిన తరువాత ఏ రేంజ్ లో విమర్శలు, వివాదాలు వస్తున్నాయో చూస్తున్నాం. కానీ ప్రభాస్ మేనియా ముందు అవన్నీ పటాపంచలైపోయాయి. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా.. నార్త్ మాత్రం ఈసినిమాను బాగానే చూస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఈసినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది కూడా. ఈనేపథ్యంలో అక్కడ ఇలాంటి రేర్ ఫీట్ ను అందుకున్న దక్షిణాది హీరో ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ ప్రభాసే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బాలీవుడ్ లో కూడా ఇలా నాలుగు సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరిన హీరోలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. మొత్తానికి సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ప్రభాస్ తన కటౌట్ తోనే కలెక్షన్స్ ను రాబట్టుకుంటున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =