జులై నుండి నాన్ స్టాప్ గా గుంటూరు కారం న్యూ షెడ్యూల్

guntur kaaram movie new schedule update

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఫుల్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. మరోవైపు అతడు, ఖలేజా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ మూవీ కావడంతో ఈసినిమావై మహేష్ అభిమానులే పాటు సినీ ప్రేక్షకులు అందరూ కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇక వారి అంచనాలను మరింత పెంచేశాయి రీసెంట్ గా  మహేష్ బాబు పుట్టినరోజు కు రిలీజ్ అయిన పోస్టర్ అలానే టైటిల్స్ గ్లింప్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈసినిమా కొత్త షెడ్యూల్ ఈనెలలో ఈపాటికే స్టార్ట్ కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈసినిమా న్యూ షెడ్యూల్ ను వచ్చే నెల జులై నుండి ప్రారంభించనున్నారట. 40 రోజుల పాటు ఈ లెంగ్తీ షెడ్యూల్ ఉండనున్నట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ తోనే ఈసినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తవుతుందట. మరి చూద్దాం వచ్చే నెల అయినా ఎలాంటి విఘ్నాలు లేకుండా సెట్స్ పైకి వెళుతుందేమో.

కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. శ్రీలీల మరో హీరోయిన్ గా కనిపించనుంది. మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.