కామ్రేడ్ కళ్యాణ్ 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్

Comrade Kalyan Breaks Even in Just 4 Days

శ్రీవిష్ణు నుండి వచ్చిన హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’ మరో అరుదైన ఘనతను సాధించింది. విడుదలైన అతి తక్కువ రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దసరా కానుకగా అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా వీకెండ్‌లో థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. కేవలం 4 రోజుల్లోనే 22 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, సరిగ్గా నాలుగో రోజుతో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు తొలి వీకెండ్‌లోనే లాభాలు తెచ్చిపెట్టి ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ స్టేటస్‌ను ఖరారు చేసుకుంది.

శ్రీవిష్ణు కెరీర్‌లోనే అత్యంత వేగంగా బ్రేక్ ఈవెన్ సాధించిన చిత్రంగా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రికార్డు నెలకొలిపింది. ఫ్యామిలీస్ అండ్ యూత్ థియేటర్ల వైపు క్యూ కడుతుండటంతో, రాబోయే వర్కింగ్ డేస్‌లో కూడా ఈ జోరు ఏమాత్రం తగ్గదని, లాభాలు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.