నాగబంధం విజువల్‌గా ప్రేక్షకులకు గ్రాండ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తుంది – అభిషేక్ నామా

Nagabandham Will Deliver a Grand Theatrical Experience Visually says Abhishek Nama

‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రం తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌తో అంచనాలను మరింత పెంచేసింది. దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో విరాట్ కర్ణ హీరోగా నటించారు. పురాణాలు, రహస్యాలు, దివ్యశక్తులు, అడ్వెంచర్ అంశాల సమ్మేళనంగా రూపొందిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఓ అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ అభిషేక్ నామా మాట్లాడుతూ:“అందరికీ నమస్కారం. జీవితంలో ఎన్నో కలలు, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కానీ ఒక గొప్ప విజన్‌ను ఆచరణలోకి తీసుకురావాలంటే దాన్ని నమ్మే నిర్మాత అవసరం. మా నిర్మాత కిషోర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమా కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయి కూడా తెరపై కనిపిస్తుంది. ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారు, డీవోపీ సౌందర్ రాజన్ గారు, మా ఎడిటర్‌తో పాటు ప్రతి సాంకేతిక నిపుణుడు నా విజన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ఎంతో కీలక పాత్ర పోషించారు. వారి సహకారం లేకుండా ఈ స్థాయి సినిమా సాధ్యమయ్యేది కాదు.

జూలై 3న మీ అందరికీ ఒక అద్భుతమైన సినిమాను అందిస్తున్నామనే నమ్మకం ఉంది. ఈ సినిమా కోసం దాదాపు మొత్తం పని తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది. ఇందులో కనిపించే విజువల్ ఎఫెక్ట్స్ కూడా మన తెలుగు టెక్నీషియన్స్ రూపొందించినవే కావడం నాకు మరింత గర్వంగా ఉంది. ఈ విజన్‌ను నిజం చేయడానికి ప్రతి ఒక్కరూ ఎంతో అంకితభావంతో పనిచేశారు. విజువల్‌గా, సాంకేతికంగా ఈ సినిమా ప్రేక్షకులకు ఒక గ్రాండ్ థియేట్రికల్ అనుభూతిని అందిస్తుంది. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.