ఓం శాంతి శాంతి శాంతిః నుండి హార్ట్ టచ్చింగ్ థీమ్ సాంగ్ రిలీజ్

Om Shanti Theme song released from Om Shanti Shanti Shantihi

 ట్యాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ తరుణ్ భాస్కర్ తన అద్భుతమైన నటనతో కూడా అలరిస్తున్నారు. ఆయన లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః. ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తున్నారు.ఏఆర్ సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం, సహజమైన హాస్యం, ఆకట్టుకునే డ్రామాతో కూడిన వినోదభరితమైన విలేజ్ కామెడీ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్ , నవీన్ సనివరపు ఈ వెంచర్‌ను నిర్మిస్తుండగా, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ సింగిల్ సిన్నారి కోన సాంగ్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా  సెకండ్ సింగిల్ ఓం శాంతి శాంతి శాంతిః థీమ్ సాంగ్ రిలీజ్ చేశారు. ప్రతి మహిళకు అంకితంగా నిలిచే ఈ పాటని జయ్ కృష్ణ హార్ట్ టచ్చింగ్ గా కంపోజ్ చేశారు. అభయ్ జోధ్‌పుర్కర్ వోకల్స్ మరింత ఎమోషన్ ని యాడ్ చేశాయి.భరద్వాజ్ గాలి రాసిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి పదం మనసుని హత్తుకొని సినిమా ఎసెన్స్ ని ప్రజెంట్ చేశాయి. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఈ పాట మెమరబుల్ ఎక్స్ పీరియన్స్ ని ఇస్తోంది.  ఓం శాంతి శాంతి శాంతిః జనవరి 23న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.