యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నూతన దర్శకుడు మారి దర్శకత్వంలో తెరకెక్కిన వినోదాత్మక చిత్రం ‘అనగనగా ఒక రాజు’. సంక్రాంతి కానుకగా 2026, జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. సుమారు 2 గంటల 30 నిమిషాల నిడివితో రూపొందిన ఈ సినిమా, ఆద్యంతం వినోదాన్ని పంచుతూ ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించేలా ఉందని సెన్సార్ సభ్యులు ప్రశంసించినట్లు సమాచారం. నవీన్ పొలిశెట్టి మార్కు కామెడీ టైమింగ్, పంచ్ డైలాగులు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిన్న విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ‘రాజు’ అనే పాత్రలో నవీన్ చేసే హడావిడి, ముఖ్యంగా పెళ్లి నేపథ్యంలో సాగే సన్నివేశాలు నవ్వులు పూయించనున్నాయి. మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.
మొత్తానికి సెన్సార్ క్లియరెన్స్ రావడంతో ఈ సినిమా విడుదలకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి.అయితే సంక్రాంతి బరిలో ఇతర భారీ చిత్రాలతో పోటీ పడుతున్నప్పటికీ, నవీన్ పొలిశెట్టికున్న క్రేజ్ మరియు సినిమాలోని ఫన్ ఎలిమెంట్స్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడతాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరిఇప్పటివరకు కెరీర్ లో అపజయమే లేకుండా కొనసాగుతున్న నవీన్ కి అనగనగా ఒక రాజు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























