మూవీ ప్రమోషన్ ఈవెంట్లలో హీరోలు, నటులు విభిన్నమైన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారడం కొత్తేమీ కాదు.తాజాగా నటుడు ప్రియదర్శి కూడా అలాంటి సంచలన వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తన కొత్త సినిమా మిత్రమండలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా ప్రియదర్శి స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మిత్రమండలి సినిమా నచ్చకపోతే, నా నెక్స్ట్ సినిమా చూడకండి అని ఆయన అన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంతకుముందు కోర్ట్ ఈవెంట్ లో కూడా నాని ఇదే డైలాగ్ చెప్పాడు.కట్ చేస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు మిత్రమండలి కోసం ప్రియదర్శి కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను చేస్తున్న సినిమా మీద నాకున్న నమ్మకమే ఇది.మీరు చూసి నిజంగా తీర్పు ఇవ్వండి అని ప్రియదర్శి అన్నారు.
ప్రియదర్శి గతంలో కామెడీ పాత్రలతో ప్రేక్షకులను అలరించాడు.కానీ ఇటీవల కాలంలో ఆయన పాత్రల ఎంపికలో చాలా మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు లీడ్ రోల్‌లో నటిస్తూ తన ప్రతిభను మరో స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. మిత్రమండలి సినిమా అతనికి ప్రత్యేకమైన మలుపుగా మారే అవకాశముంది.
ఇక ఈ సినిమా అక్టోబర్ 16న థియేటర్లలోకి రానుంది. ప్రియదర్శి , నిహారిక ఎన్ ఎమ్,విష్ణు ఓయ్ , రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా కీలక పాత్రల్లో నటించిన ఈసినిమాను విజయేందర్ డైరెక్ట్ చేయగా బన్నీ వాసు ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. రేపు ఈసినిమా పెయిడ్ ప్రీమియర్స్ కూడా పడనున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























