జటాధర నుండి ‘సోల్ ఆఫ్ జటాధర’ రిలీజ్

Soul of Jatadhara Unveiled From Sudheer Babu and Sonakshi Sinha's Divine Film

నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హై-ఆక్టేన్ విజువల్స్, పౌరాణిక ఇతివృత్తాలతో ఈ చిత్రం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది. ఇటివల రిలీజ్ అయిన టీజర్ నేషనల్ వైడ్‌గా వైరల్ అయ్యింది. ఈ విజువల్ స్పెక్టకిల్ నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా మేకర్స్ ఫస్ట్ ట్రాక్ ‘సోల్ ఆఫ్ జటాధార’ను రిలీజ్ చేశారు.

ఈ ‘సోల్ ఆఫ్ జటాధర’ సినిమా ప్రిమైజ్‌ని అద్భుతంగా సెట్ చేసింది. సాంప్రదాయ సంగీతం, డివైన్ టచ్ కలిపిన ఈ స్వరాలు మనల్ని జటాధర ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. బీట్‌లు చాలా ఇంటెన్స్‌గా ఉండి, సినిమా టోన్‌తో పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. “ఓం నమఃశివాయ” జపం గూస్ బంప్స్ తెప్పించింది.

‘సోల్ ఆఫ్ జటాధర’తో ప్రమోషన్స్‌కి ఇప్పుడు కంప్లీట్ జోష్ కంపొచ్చింది. రాజీవ్ రాజ్ కంపోజ్ చేసి, స్వయంగా పాడిన ఈ ఆడియో గ్లింప్స్ అందరిని ఆకట్టుకుంది. డివోషనల్ డెప్త్, రా ఎనర్జీతో కూడినన ఈ పాట సినిమా ఎసెన్స్‌ని ప్రజెంట్ చేస్తోంది.

కాగా, జటాధరలో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హాతో పాటు దివ్య ఖోస్లా, శిల్పా శిరోధ్కర్, ఇంద్రకృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, సుభలేఖ సుధాకర్‌ వంటి ప్రముఖ నటీనటులు కనిపించనున్నారు. మంచికి–చెడుకి, వెలుగుకి–చీకటికి, మానవ సంకల్పానికి– విధికి మధ్య జరిగే అద్భుతమైన పోరాటాన్ని ఈ చిత్రం చూపించబోతోంది.

జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరు‍ణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. అక్షయ్ కేజ్రీవాల్, కుస్సుమ్ అరోరా సహ నిర్మాతలుగా వ్యవహరించారు. డివ్యా విజయ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, భావిని గోస్వామి సూపర్వైజింగ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.