లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ యాక్షన్-క్రైమ్ డ్రామా చిత్రం ‘ఘాటి’. విక్రమ్ ప్రభు, చైతన్య రావు, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, అనుష్క అద్భుతమైన నటనకు క్రిష్ టేకింగ్ తోడై ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తాజాగా డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కి వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. సో.. థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడని ప్రేక్షకులు ఇప్పుడు తమ ఇంటి వద్దే ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయవచ్చు.
‘ఘాటి’ కథాంశం ఏమిటంటే..
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం… ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లోని దట్టమైన తూర్పు కనుమల్లో నివసించే గిరిజన తెగల జీవితాలను చూపిస్తుంది. శ్రమదోపిడీకి గురై అక్రమ వ్యాపారం, స్మగ్లింగ్ దందాలలోకి దిగాల్సిన పరిస్థితిని ఎదుర్కొనే ఒక వర్గం ప్రజల కథ ఇది. అనుష్క శెట్టి ఈ చిత్రంలో శీలావతి అనే శక్తివంతమైన పాత్రను పోషించారు. వ్యవస్థీకృత నేర సిండికేట్‌కు వ్యతిరేకంగా తన ప్రజల కోసం పోరాడే ధైర్యవంతురాలిగా అనుష్క నటన అద్భుతంగా ఉందని ప్రశంసలు దక్కాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























