పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ముందురోజు వేసిన బెనిఫిట్ షోలతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ అందరి అంచనాలకు తగ్గట్టే తొలిరోజే బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో, ఈ సినిమాను వీక్షించడానికి అభిమానులతోపాటు పలువురు స్టార్ హీరోలు సైతం ఆసక్తిని కనబరిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అభిమానులకు ఆశ్చర్యం..
దీనిలో భాగంగానే హైదరాబాద్‌లో ఈ సినిమా చూసేందుకు ఒక ప్రత్యేక అతిథి వచ్చారు. ఆయనే కోలీవుడ్ స్టార్ హీరో, ‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్. నగరంలోని ప్రముఖ విమల్ థియేటర్లో ప్రదీప్ రంగనాథన్ హఠాత్తుగా ప్రత్యక్షమవడంతో అక్కడి ప్రేక్షకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశ్చర్యపోయారు. తమ అభిమాన స్టార్ తమ మధ్యే ఉండి ‘ఓజీ’ సినిమా చూడటం చూసిన ఆడియన్స్ ఆనందానికి అవధులు లేవు.
సినిమా పూర్తయిన తర్వాత ప్రదీప్ రంగనాథన్ అక్కడి అభిమానులతో సరదాగా ముచ్చటించారు. చాలా మంది ఫ్యాన్స్‌కు షేక్ హ్యాండ్స్* ఇచ్చి, వారితో ఉత్సాహంగా సెల్ఫీలు దిగారు. ‘ఓజీ’ సినిమా తనకు బాగా నచ్చిందని, పవర్ స్టార్ గ్రేస్, స్టైల్ అద్భుతంగా ఉందని ఆయన కితాబిచ్చారు. ఇదిలావుంటే, మరోవైపు ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా చిత్రం ‘డ్యూడ్’ కూడా త్వరలో తెలుగులో విడుదల కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























