కోలీవుడ్ స్టార్ హీరో సూర్య – టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.సూర్యకి ఇది 46వ సినిమా. ఇప్పటివరకు సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈసినిమా గురించి ఇంతవరకు అప్డేట్ ఏమి బయటకు రాలేదు. అయితే కాంబినేషన్ కు వున్న క్రేజ్ తో అప్పుడే ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ ఈసినిమా డిజిటల్ రైట్స్ ను రికార్డు ధరకు సొంతం చేసుకుంది.అన్ని భాషలకు గాను ఈ డీల్ కుదిరినట్లు సమాచారం.సార్ ,లక్కీ భాస్కర్ సక్సెస్ లతో వెంకీ అట్లూరి సూపర్ ఫామ్ లో ఉండడంతో సినిమా మీద నమ్మకంతో భారీ పోటీ మధ్య నెట్ ఫ్లిక్స్ ఈరైట్స్ ను దక్కించుకుందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రేమలు ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా రవీనా టాండన్ ,రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఇక సూర్య ఈసినిమా కన్నా ముందు కరుప్పు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంటుంది.ప్రముఖ నటుడు, కమెడియన్ ఆర్ జె బాలాజీ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా త్రిష కథానాయికగా నటించింది.డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది.అయితే ఈసినిమా విడుదల ఆలస్యం అయ్యేలా వుంది.నిజానికి ఈసినిమాను వచ్చే ఏడాది పొంగల్ బరిలో నిలుపాలనుకున్నారు కానీ ఇప్పుడు ఆ స్లాట్ మిస్ అయ్యిందట. దాంతో సమ్మర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. త్వరలోనే రిలీజ్ డేట్ విషయంలో ఓ క్లారిటీ రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























