మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అండ్ మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘దక్ష – ది డెడ్‌లీ కాన్స్పిరసీ’ (Daksha – The Deadly Conspiracy). ఈ సినిమాలో డాక్టర్ మంచు మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తండ్రీ కూతుళ్లు కలిసి మొదటి సారిగా ఈ చిత్రంలో నటించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వంశీ కృష్ణ మల్లా కథ, స్క్రీన్‌ప్లేతో పాటు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇంకా సముద్రఖని, సిద్దిక్, విశ్వంత్, చిత్రా శుక్లా, రంగస్థలం మహేశ్, జెమినీ సురేష్, తదితరులు నటించారు. ఈ నెల 19న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరోయిన్ మంచు లక్ష్మి మాట్లాడుతూ..” ‘దక్ష’ కథను నా దగ్గరకు నాన్న గారు తీసుకొచ్చారు. ఆయనే ఈ కథను తీసుకొచ్చారా అనేది మొదట్లో నమ్మలేకపోయాను. ప్రతి చిత్రంతో మనకొక సొంత టీమ్ తయారవుతుంది. మహేశ్, జెమినీ సురేష్ వంటి కో ఆర్టిస్టులతో మాకొక కొత్త టీమ్ ఫామ్ అయ్యింది. దక్ష సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఇది తమ సినిమా అనుకునే నటించారు. మహేశ్ అయితే ప్రమోషన్స్ గురించి ఎలా చేయాలో చెప్పేవాడు.”
“ఈ చిత్రంలో నాన్న గారి ఇమేజ్‌కు తగినట్లు పర్పెక్ట్ క్యారెక్టర్ ఉంది. అందుకే ఆయనను అడిగాం. సముద్రఖని, సిద్దిక్, విశ్వంత్, చిత్రా శుక్లా..ఇలా పాన్ ఇండియా వైజ్ చూస్తే ప్రతి భాష నుంచి పేరున్న ఆర్టిస్టులు మా చిత్రంలో నటించారు. నాన్న గారి తర్వాత నన్ను అంత బాగా చూసుకునేది మనోజ్. తను సినిమా చేయనప్పుడు ఇలాంటి మంచి ఆర్టిస్ట్ స్క్రీన్ మీద మళ్లీ ఎప్పుడు కనిపిస్తాడు అని ఒంటరిగా బాధపడ్డాను. మనోజ్ హీరోగానే కాదు, విలన్ గానూ మెప్పించగలడు, కామెడీ చేయగలడు. వర్సటైల్ యాక్టర్‌గా ప్రూవ్ చేసుకున్నాడు.”
“దక్ష సినిమాకు మనోజ్ ఇచ్చిన సజెషన్స్‌ను తీసుకున్నాను. ఎందుకంటే, మనోజ్‌కు ఫిలిం మేకింగ్ మీద, ప్రతి క్రాఫ్ట్ మీద పట్టుంది. నాన్న గారితో, అమితాబ్ ‘పీకూ’ లాంటి మూవీ చేయాలని ఉంది. నటిగా నా ప్రయాణాన్ని ఆపను. తమిళం, మలయాళంలో కూడా నటించాను. నా దగ్గరకు వచ్చే ప్రాజెక్ట్స్ ముందు నటిగా వచ్చి, ఆ తర్వాత ప్రొడ్యూస్ చేయమని అడుగుతున్నారు. ప్రొడక్షన్ అంత ఈజీ కాదు. మా దక్ష చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీ వాళ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ‘కన్నప్ప, మిరాయ్’ తర్వాత వాళ్లకు మా సినిమా హ్యాట్రిక్ అవ్వాలి” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























